ఆ వీడియో చూసి కంగుతిన్న చంద్రబాబు ... అందులో ఏముందో తెలుసా ?

ఆ వీడియో చూసి కంగుతిన్న చంద్రబాబు ... అందులో ఏముందో తెలుసా ?
x
Highlights

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసినప్పటి నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సమీక్షలు, సమావేశాల అంటూ తెగ హడావుడి చేస్తున్న విషయం...

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసినప్పటి నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సమీక్షలు, సమావేశాల అంటూ తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఇక ఎన్నికల కమిషన్‌పై నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడుతూ వస్తున్నారు. ఇక వీలు దొరికినప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి పయనమై మీడియా సమావేశాలు పెట్టి మరి ఈసీపై నిప్పులు చేరుగుతున్నారు. వీపీ ప్యాట్లు లెక్కించాలంటూ కూడా జాతీయ స్థాయిలో పెద్దఎత్తున అన్ని పార్టీలను కూడగట్టి ఎన్నికల సంఘంపై ఓ మహా యుద్ధం ప్రకటించినంత పనిచేశారు. అయితే తాజాగా ఏపీలో రీపోలింగ్ అంశం తెరపైకి రావడంతో నారా చంద్రబాబు అదే బాటలో పయనిస్తున్నారు. ఏపీలోని చంద్రగిరి రిపోలింగ్ అంశంపైనా కూడా అదే రేంజ్‌లో దూకుడు ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు.

రీ పోలింగ్ నిర్ణయం తెలియగానే వెంటనే దేశ రాజధాని ఢిల్లీకి పయనమై ఈసీని కలిశారు. ఇదెక్కడి చోద్యమంటూ ఈసీని నిలదీశారు. దీంతో ఈసీ అధికారులు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబుకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చారు. ఈసీ అధికారులతో నారా చంద్రబాబు చాలా ఆవేశంగా మాట్లాడిన ఈసీ అధికారులు మాత్రం చంద్రబాబుకు నిమ్మలంగా సమాధానం చెప్పారట. చంద్రబాబు ఆవేశం ముగిసిన తరువాత ఓ వీడియో బాబుకు చూపించారట. ఇదిగో మీ పార్టీ వాళ్లు ఎలా ప్రవర్తించారో మీరే చూసుకోండి చంద్రబాబు గారు అంటూ వీడియో ఫుటేజ్‌ను చంద్రబాబు ముందు ఉంచరట. ఆ వీడియోలో ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరిలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిన వీడియోను చంద్రబాబు చూపించారట. ఇక ఆ వీడియోల్లో బుత్ క్యాప్చరింగ్ చేసి ఓట్లు రిగ్గింగ్ చేయడం స్పష్టంగా రికార్డయ్యింది. మరీ ఇంత ఘోరంగా ఉన్నా కూడా రీ పోలింగ్ పెట్టకూడదా అని ఈసీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించారట. దీంతో చంద్రబాబు సప్పడు సరిచేయకుండా బయటకు వచ్చిన నారా చంద్రబాబు ఎప్పటిలాగే మీడియా సమావేశం పెట్టి ఎన్నికల సంఘం వివక్ష మీద నిప్పులు చెరిగేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇక మరో వైపు జాతీయ నేతలతో చంద్రబాబు వరుసగా భేటీ అవుతున్నారు. ఏపీ భవన్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పాటు చేయబోయే నరేంద్ర మోడీ వ్యతిరేక కూటమి అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఇక మరి కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories