రక్తం మండిన బాబు... రగిలింది ఎవరిపైన?

రక్తం మండిన బాబు... రగిలింది ఎవరిపైన?
x
Highlights

ఎవరికి ఊడిగం చేస్తారు మీరు ..? రక్తం ఉడికిపోతుంది..? ఆవేదన ఉండదా మాకు..? రోషం లేదా? తమాషాగా ఉందా.. న్యాయం జరిగేంత వరకు వదిలి పెట్టాం. ఏపీ సీఎం...

ఎవరికి ఊడిగం చేస్తారు మీరు ..? రక్తం ఉడికిపోతుంది..? ఆవేదన ఉండదా మాకు..? రోషం లేదా? తమాషాగా ఉందా.. న్యాయం జరిగేంత వరకు వదిలి పెట్టాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన ఘాటు వ్యాఖ్యలివి.. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏపీకి అన్నీ ఇచ్చామని చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త రాష్ట్రం వస్తే మద్దతు ఇవ్వాల్సింది పోయి కేసులతో వేధించుకుని తింటున్నారని మండిపడ్డారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో బీజేపీ, వైసీపీలపై నిప్పులు చెరిగారు ప్రత్యేక హోదాపై తాను మాట మార్చలేదని కేంద్రమే తప్పుడు సమచారమిచ్చి అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో మోసం చేశారని ఆ సంఘం చైర్మన్ హోదాపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్వయంగా చెప్పారన్నారు.

దక్షిణాది నుంచి ఒక్క కేంద్ర మంత్రి అయినా మోదీ కేబినెట్ లో ఉన్నారా అని ప్రశ్నించారు. వెంకయ్య నాయుడు దక్షిణాది నుంచి ఒకే ఒక కేంద్ర మంత్రిగా ఉండేవాడు. ఆయన అన్ని రాష్ట్రాలకు తిరిగేవాడు. ఆయన్ను కూడా పదవి నుంచి తీసేసి ఉప రాష్ట్రపతిని చేసేశారు. ఎంత అసూయ అధ్యక్షా పాపం వెంకయ్య నాయుడు. ఆయనకు ప్రమోషన్ ఇచ్చారో, లేక పనిష్మెంట్ ఇచ్చారో ఆ దేవుడికే తెలియాలి. దక్షిణాది నుంచి ఒక్కరైనా కేంద్ర మంత్రి ఉన్నారా? దత్తాత్రేయ ఉంటే ఆయన్ను తీసేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాది వ్యక్తికి ప్రధాని పదవి పోతే, దక్షిణాదికి రాష్ట్రపతి పదవి ఇచ్చి బ్యాలెన్స్ చేసేవారు'అని చెప్పారు.

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. కేంద్రం చాలానే ఇచ్చిందని లెక్కలు చెబుతుంటే చంద్రబాబు మధ్యలో అడ్డుకున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విష్ణుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కేంద్ర సంస్థలు ఎవరి కోసం ఇస్తారని ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉండటానికి విష్ణుకుమార్ రాజుకు అర్హత లేదన్నారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడికేసులో ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్టుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రిపోర్ట్ కోడిగుడ్డుపై ఈకలు తీసిన చందాన ఉందన్నారు. అసలు కోడికత్తి కేసులో కేంద్రానికి ఏం సంబంధముందని ప్రశ్నించారు. గుజరాత్ సీఎంగా ఎన్ఐఏని మోడీ వ్యతిరేకించారని. టెర్రరిస్ట్ దాడుల లాంటి వాటిలోనే ఎన్ఐఏ చార్జ్ తీసుకుంటుందని చెబితేనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కోడికత్తి కేసు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? ఏం చేశార ప్రశ్నించారు. చివరకు రాష్ట్ర సిట్ చెప్పిన మాటే ఎన్ఐఏ చెప్పిందన్నారు. చివరికి సీబీఐని కూడా భ్రస్టుపట్టించారని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories