Top
logo

జగన్‌కు రాజకీయాలు తెలియవు: చంద్రబాబు

జగన్‌కు రాజకీయాలు తెలియవు: చంద్రబాబు
X
Highlights

మోడీ నీ ఆటలు మాదగ్గర సాగవన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోడీకి మనగడ్డపై అడుగు పెట్టే అర్హత లేదని చెప్పారు....

మోడీ నీ ఆటలు మాదగ్గర సాగవన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోడీకి మనగడ్డపై అడుగు పెట్టే అర్హత లేదని చెప్పారు. వందమంది మోడీలు వచ్చినా పోలవరం ఆగదని తెలిపారు. జగన్‌కు రాజకీయాలు తెలియవని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆంధ్రవాళ్లను నోటికచ్చిన్టలు తిట్టాడన్నారు చంద్రబాబు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగించారు. బీసీలంతా టీడీపీవైపే ఉన్నారన్నారు. ఎస్సీ కాలనీల్లో సిమెంట్‌ రోడ్లు, ఇళ్లు కట్టించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా 150 యూనిట్ల కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో మూడు హజ్‌హౌస్‌లు కడుతున్నామని వెల్లడించారు. మోదీని ఇంటికి పంపించాలంటే టీడీపీ వల్లే సాధ్యమని పేర్కొన్నారు. మోదీ, కేసీఆర్‌ మన రాష్ట్ర విరోధులుగా అభివర్ణించారు.

Next Story