logo

నేడు కడప, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

నేడు కడప, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల స్పీడ్ పెంచేశారు. పొలింగ్ కు దగ్గరపడే కొద్ది నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే నేడు సోమవారం కడప, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తమ పార్టీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థుల కోసం చంద్రబాబు ప్రచార చేయనున్నారు. నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు కడప జిల్లాలోని జమ్మలమడుగులో జరిగే బహిరంగ సభలో, 2.55 గంటలకు పులివెందులలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో, 6.15 గంటలకు పూతలపట్టులో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

లైవ్ టీవి

Share it
Top