Top
logo

రూట్‌ మార్చిన బాబు...ఆటోవాలాగా....

రూట్‌ మార్చిన బాబు...ఆటోవాలాగా....
X
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు రూట్‌ మార్చారు. చెప్పాలంటే టోటల్‌గా నయా స్టైల్‌ను ఫాలో అవుతున్నారు. సభలు, కాన్పరేన్స్‌లంటూ ...

ఏపీ సీఎం చంద్రబాబు రూట్‌ మార్చారు. చెప్పాలంటే టోటల్‌గా నయా స్టైల్‌ను ఫాలో అవుతున్నారు. సభలు, కాన్పరేన్స్‌లంటూ బిజీగా గడుపుతూనే జనంతో మమేకం అవుతున్నారు. కేంద్రంపై మాటల యుద్ధం ప్రకటిస్తునే ప్రజలను నవ్వుతూ పలకరిస్తున్నారు.

నిన్ననల్లచోక్కాతో దర్శనమిచ్చిన టీడీపీ అధినేత నేడు ఆటోవాలాగా మారిపోయారు. ఖాకీ చొక్కా వేసుకుని ఆటో నడిపాడు. స్వయంగా ఆటో హ్యాండిల్ పట్టి కాసేపు డ్రైవర్‌గా మారిపోయారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆటో నడపడంతో ఆటోవాలాల్లో ఉత్సాహం నెలకొంది ప్రజలకు దిశానిర్ధేశం చేస్తునే నా రూటే సపరేట్‌ అంటూ ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతున్నారు.

ఆటోలపై పన్ను ఎత్తివేసినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చిన ఆటో డ్రైవర్లతో కాసేపు సీఎం ముచ్చటించారు. తన 40 ఏళ్ల సర్వీస్‌లో ఎప్పుడు ప్రొఫిషనల్‌గా కనిపించే చంద్రబాబు ఇప్పడు రోజుకో అవతారంలో కనిపించడంతో తెలుగు తమ్ముళ్లు ఖుషి అవుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఆహార్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబే నెక్ట్‌ సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఏదేమైనా సీఎం చంద్రబాబు ఇలా రోజుకో స్టైల్‌లో కనిపించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Next Story