Top
logo

కేసీఆర్‌ బెదిరింపుల వల్లే... వైసీపీలోకి సినీ నటులు

కేసీఆర్‌ బెదిరింపుల వల్లే... వైసీపీలోకి సినీ నటులు
Highlights

వైసీపీ అధినేత జగన్‌పై చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాలన్న...

వైసీపీ అధినేత జగన్‌పై చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాలన్న కేసీఆర్‌తో కలిసి జగన్‌ హోదా తెస్తాడా అంటూ ప్రశ్నించారు. పోలవరంపై పదేపదే కేసులేసే కేసీఆర్‌కు జగన్‌ మద్దతిస్తున్నారని, రాయలసీమను ఎడారి చేయాలనుకుంటున్న కేసీఆర్‌తో జగన్‌ దోస్తీ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్‌ బెదిరింపుల వల్లే సినీనటులు వైసీపీలో చేరుతున్నారని హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణ కోసమే జగన్‌ వద్దకు వెళ్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కేసుల కోసం మోడీతో, ఆస్తుల కోసం కేసీఆర్‌తో జగన్‌ లాలూచి పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. సొంత లాభాల కోసం ఏపీ ప్రయోజనాలకు జగన్‌ గండికొడుతున్నారని అన్నారు.

Next Story


లైవ్ టీవి