మంత్రులకు చంద్రబాబు క్లాస్

మంత్రులకు చంద్రబాబు క్లాస్
x
Highlights

ఐటీ గ్రిడ్ సంస్థ డేటా చోరీ వ్యవహారం, తెలంగాణ పోలీసులు పెట్టిన కేసులపై ఏపీ కేబినెట్‌ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. మూడు గంటల పాటు జరిగిన మంత్రివర్గ...

ఐటీ గ్రిడ్ సంస్థ డేటా చోరీ వ్యవహారం, తెలంగాణ పోలీసులు పెట్టిన కేసులపై ఏపీ కేబినెట్‌ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. మూడు గంటల పాటు జరిగిన మంత్రివర్గ భేటీలో దాదాపు డేటా వార్‌పై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ సర్కార్‌ టీడీపీ ప్రభుత్వాన్ని పలు రకాలుగా ఇబ్బందులు పెడుతోందని మంత్రివర్గం అభిప్రాయపడింది. విద్యుత్ బకాయిలు పెండింగ్ పెట్టడంతో పాటు పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేయడం, ఆస్తుల పంపిణీకి సహకరించక పోవడంవంటివి చేస్తోందని సీఎం అన్నారు. బకాయిలు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా మళ్ళీ మనపైనే నిందలు వేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన అప్పుల్ని వెంటనే వసూలు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. వివాదాల్ని కేవలం కోర్టులకే వదిలేయకుండా రావాల్సినవి రాబట్టాలని స్పష్టం చేశారు.

అయితే డేటా చోరీ వ్యవహారంలో మంత్రులు సరిగా స్పందించలేదంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు, టీఆర్ఎస్ నేతల ఆరోపణలకు సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారని పెదవి విరిచారు. ఈ రోజుల్లో ప్రతి చోటా డేటా ఇవ్వాల్సిన అవసరం ఉంద్న చంద్రబాబు ఆ విషయం తెలిసి కూడా మంత్రులు ధీటుగా సమాధానమివ్వలేదని అన్నారు. ఇకనుంచైనా తెలంగాణ ప్రభుత్వ ఆరోపణలకు మంత్రులు ధీటుగా జవాబివ్వాలని చంద్రబాబు ఆదేశించారు.

టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలనే యోచనతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని ఏపీ మంత్రులు ఆరోపించారు. జగన్‌కు సాయం చేయాలనే దురుద్దేశంతో ప్రధాని ఆదేశాల మేరకు కేసీఆర్ ఇలాంటి దాడులు చేయిస్తున్నారని అభిప్రాయపడ్డారు. డేటా దుర్వినియోగం విషయంలో న్యాయపోరాటం చేసే అంశంపై ఏపీ మంత్రివర్గం చర్చించింది. ఎన్నికల సమయంలో న్యాయ పోరాటం చేయడం వల్ల జరిగే పరిణామాలపై దృష్టి పెట్టాలని సీనియర్ మంత్రులు సూచించారు. అలాగే ఐటీ గ్రిడ్ డేటా చోరీ కేసుల విషయంలో న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories