పచ్చ చంద్రుడు నలుపెక్కాడు

పచ్చ చంద్రుడు నలుపెక్కాడు
x
Highlights

ఏపీ సీఎంచంద్రబాబు నయా లుక్‌లో కనిపించారు. చంద్రబాబు పేరు చెప్పగానే ఆయన డ్రెస్సింగ్ స్టయిల్ మన కళ్లముందు కదులుతుంది. 40 ఏళ్లుగా ఒకే డ్రెస్‌ స్టైల్‌...

ఏపీ సీఎంచంద్రబాబు నయా లుక్‌లో కనిపించారు. చంద్రబాబు పేరు చెప్పగానే ఆయన డ్రెస్సింగ్ స్టయిల్ మన కళ్లముందు కదులుతుంది. 40 ఏళ్లుగా ఒకే డ్రెస్‌ స్టైల్‌ ఫాలో అవుతున్న టీడీపీ అధ్యక్షుడు రంగులు మార్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరసన కార్యక్రమాల్లో నల్ల బ్యాడ్జీలకే పరిమితమైన ఆయన తొలిసారి నల్ల చొక్కాలో దర్శనమిచ్చారు. అలాంటి పచ్చదళపతి కొత్తలుక్‌లో కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది.

ఏపీకి కేంద్రం అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ బ్లాక్ షర్ట్ వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. వైట్‌ ప్యాంట్‌పై నల్లరంగు చొక్కా వేసుకుని కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని మోదీ నాటకాలు ఆడుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర వైఖరీతో పాటు రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా ఎమ్మెల్యేలంతా ఈ డ్రెస్ కోడ్ లో వచ్చారు. నల్లచొక్కాలతో అందరూ మూకుమ్మడిగా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories