తీర్పును గౌరవిస్తాం పోరాటం కొనసాగిస్తాం

తీర్పును గౌరవిస్తాం పోరాటం కొనసాగిస్తాం
x
Highlights

ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై వేసిన రివ్యూ పిటీషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 50 శాతం...

ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై వేసిన రివ్యూ పిటీషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో 21 పార్టీలు రివ్యూ పిటీషన్‌ వేశాయి. అయితే విచారణకు స్వీకరించిన ధర్మస్థానం పిటిషన్‌ను తిరస్కరించింది. వాదనలు వినేందుకు కూడా అంగీకరించని ధర్మాసనం గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను మార్చాలనే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేసింది.

గతంలో ఇదే అంశంపై విచారించిన సుప్రీంకోర్టు అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్లు, పార్లమెంట్‌ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ఈసీని ఆదేశించింది. అయితే సుప్రీం ఆదేశాలను ఈసీ అమలు చేయకపోతే ఏంటనే విషయాన్ని ధర్మాసనం ఎదుట అభిషేక్‌ మనూసింఘ్వీ ప్రస్తావించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. కనీసం 2 శాతం వీవీప్యాట్లు కూడా లెక్కించడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే తమ అభ్యర్థనను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చిందని పిటిషనర్ల తరపు న్యాయవాది అభిషేక్‌ మనూసింఘ్వీ తెలిపారు.

వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వీవీప్యాట్ల లెక్కింపుపై ముందుగా ఈసీని సంప్రదించామని ఆ తర్వాతే సుప్రీంకోర్టు తలుపుతట్టామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేదే తమ కోరికన్న చంద్రబాబు ఈ విషయంపై ఈసీని మరోసారి సంప్రదిస్తామన్నారు. మరోసారి తప్పిదాలు దొర్లితే సుప్రీంకోర్టుకు కూడా మళ్లీ వెళ్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories