Top
logo

గుంటూరు పార్లమెంట్‌ స్థానాన్ని ఖరారు చేసిన చంద్రబాబు

గుంటూరు పార్లమెంట్‌ స్థానాన్ని ఖరారు చేసిన చంద్రబాబు
X
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. సీఎం ...

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు పార్లమెంట్‌పై ఆదివారం సమీక్ష జరిపారు. గుంటూరు టీడీపీ నేతలతో మంతనాలు జరిపారు. అనంతరం గుంటూరు పార్లమెంట్ పై స్పష్టత ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ స్థానానికి గల్లా జయదేవ్‌ పేరు ఖరారు చేశారు. ఇక పోతే పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి-ఆలపాటి రాజా పేర్లను సీఎం ఖరారు చేశారు. గుంటూరు తూర్పు- ముస్లిం మైనార్టీలకు, గుంటూరు పశ్చిమ- మద్దాల గిరి, ఎస్సీ, రెడ్డి వర్గాల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాడికొండ- బాపట్ల ఎంపీకి మాల్యాద్రి, శ్రవణ్‌కుమార్‌, డొక్కా పేర్లు వినిపిస్తున్నాయి.

Next Story