Top
logo

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok SabhaLok Sabha
Highlights

చరిత్రాత్మక బిల్లుకు ముందడుగు పడింది. అగ్రవర్ణాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూడింట రెండొంతులకు పైగా సభ్యులు మద్దతు తెలిపారు.

చరిత్రాత్మక బిల్లుకు ముందడుగు పడింది. అగ్రవర్ణాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూడింట రెండొంతులకు పైగా సభ్యులు మద్దతు తెలిపారు. లోక్‌సభలో ఆమోదం పొందడంతో ఇవాళ రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. మూడింట రెండొంతులకు పైగా సభ్యులు ఈబీసీ బిల్లుకు మద్దతు తెలిపారు. సభలో ఉన్నవారిలో కేవలం ముగ్గురు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈబీసీ బిల్లు పాసైనట్లు ప్రకటించారు. ఓటింగ్‌లో మొత్తం 326 మంది ఎంపీలు పాల్గొనగా అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరిగింది. 124వ రాజ్యంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి థావర్ చంద్ గహ్లోత్ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదం పరిపూర్ణం చేయడానికే ఈబీసీ రిజర్వేషన్లను తీసుకొచ్చామని అన్నారు. రాజ్యాంగంలోని 15వ అధికరణకు క్లాజ్ 6ను జోడించి అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిచాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత ఆయా కుటుంబాలకు 10 శాతం రిజర్వేషన్లు వర్తించవని థావర్ చంద్ గహ్లోత్ స్పష్టంచేశారు.

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తేల్చిచెప్పారు. 50శాతం పరిమితి అనేది కేవలం కుల రిజర్వేషన్లకేనని అన్నారు. 50 శాతం రిజర్వేషన్ పరిమితి అన్నది ఆర్టికల్ 16 (4) ప్రకారం నిర్ణయించారని అందుకే తాము ఆర్టికల్ 15, 16 అధికరణలకు సవరణ చేసి ఆర్థిక పరమైన రిజర్వేషన్లకు న్యాయపరమైన అడ్డంకులు లేకుండా చూస్తామన్నారు. చట్టబద్దత కోసమే ఆర్టికల్ 15, 16లకు అదనపు క్లాజ్ లు జోడించామని, అలాగే ఈబీసీ రిజరేషన్ల అర్హత ధ్రువీకరణలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కేంద్రం స్పష్టంచేసింది.

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లును పలు పార్టీలు వ్యతిరేకించినప్పటికీ మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో లోక్‌‌సభలో బిల్లు పాస్ అయ్యింది. బిల్లుకు అనుకూలంగా 323, వ్యతిరేకంగా 3 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్ సభ నిరవధికంగా వాయిదాపడింది.

Next Story

లైవ్ టీవి


Share it