కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం...వైసీపీ ఫిర్యాదుపై ...

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం...వైసీపీ ఫిర్యాదుపై ...
x
Highlights

కేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావుతోపాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలపై బదిలీ వేటేసింది. వైసీపీ...

కేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావుతోపాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలపై బదిలీ వేటేసింది. వైసీపీ ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న ఈసీ ఈ ముగ్గురినీ ఎన్నికల విధుల నుంచి తప్పించి హెడ్‌క్వార్టర్స్‌‌కు అటాచ్ చేసింది.

ఎన్నికలవేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై సీఈసీ చర్యలు తీసుకుంది. ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావుతోపాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఈ ముగ్గురినీ ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావుతోపాటు కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, అలాగే శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నాన్ని హెడ్‌క్వార్టర్స్‌కి అటాచ్ చేసింది. ఈ ముగ్గురికీ ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశించింది. అలాగే వీరి స్థానాల్లో సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి సూచించింది.

ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌‌తోపాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు పనిచేస్తూ టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసింది. అలాగే వైఎస్ వివేకా మర్డర్ తర్వాత పరిణామాలను హ్యాండిల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

వైసీపీ కంప్లైంట్‌‌పై దర్యాప్తు జరిపిన సీఈసీ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావుతోపాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. అయితే తాము ఇంకా పలువురు ఉన్నతాధికారులపై సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశామని, ముఖ్యంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్‌‌ను తప్పించాలని వైసీపీ అంటోంది. మరి పోలింగ్‌ తేదీలోపు ఇంకెన్ని సంచలన నిర్ణయాలుంటాయో చూడాలి.





Show Full Article
Print Article
Next Story
More Stories