Top
logo

ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం

ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో దుమ్మురేపిన భారతీయ జనతా పార్టీ... ఏకంగా 303 స్థానాలు సొంతంగా గెలుచుకొని... తిరుగులేని...

సార్వత్రిక ఎన్నికల్లో దుమ్మురేపిన భారతీయ జనతా పార్టీ... ఏకంగా 303 స్థానాలు సొంతంగా గెలుచుకొని... తిరుగులేని శక్తిగా మారింది. గతంలో కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించి.. మరోసారి అధికారపీఠం ఎక్కనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇవాళ సాయంత్రం ప్రధాని కార్యాలయంలోని సౌత్ బ్లాక్‌లో జరగనున్న ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులతో పాటు సహాయ మంత్రులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత 16వ లోక్ సభను రద్దు చేసేలా సిఫార్సు చేయనున్నారు. అనంతరం కేబినెట్ తీర్మానం తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రస్తుత లోక్‌సభను రద్దు చేయనున్నారు

ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3 వరకు ఉండగా.. లోక్‌సభను రద్దు చేసిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. రెండ్రోజుల్లో ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతితో సమావేశమై కొత్తగా ఎన్నికైన లోక్ సభ అభ్యర్థుల జాబితాను అందజేస్తారు. జూన్ 3 లోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారు.


లైవ్ టీవి


Share it
Top