కోల్‌కతా మాజీ చీఫ్‌పై లుకౌట్‌ నోటీసు

కోల్‌కతా మాజీ చీఫ్‌పై లుకౌట్‌ నోటీసు
x
Highlights

శారదా చిట్స్‌ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కోంటున్న కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ పై సీబీఐ ఉచ్చుబిగిస్తోంది. రాజీవ్ కుమార్ విదేశాలకు పారిపోకుండా...

శారదా చిట్స్‌ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కోంటున్న కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ పై సీబీఐ ఉచ్చుబిగిస్తోంది. రాజీవ్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీస్ జారీ చేసిన సీబీఐ ఇవాళ ఉదయం 10 గంటల కల్లా సాల్ట్‌ లేక్‌ లోని తమ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. అయితే ఈ నోటీసులు స్వయంగా అందజేయడానికి నలుగురు సీబీఐ అధికారులు నిన్న రాత్రి అతని నివాసంతో పాటు సంబంధిత కార్యాలయాలకు కూడా వెళ్లారు. అయినా అతడు అందుబాటులో లేకపోవడంతో మూడు చోట్లా నోటీసులు ఇచ్చారు.

మొదట కోల్‌కతాలోని రాజీవ్‌కుమార్‌ అధికారిక నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లగా అక్కడ ఆయన లేకపోవడంతో పార్క్‌స్ట్రీట్‌కు దగ్గర్లోని పోలీసు కార్యాలయానికి వెళ్లారు. అక్కడా రాజీవ్‌ కనిపించకపోవడంతో సీఐడీ ప్రధాన కార్యాలయమైన భవానీభవన్‌కు వెళ్లారు. ఈ మూడు చోట్ల అక్కడి సిబ్బందికి నోటీసులు అందజేశారు. దర్యాప్తునకు రాజీవ్‌కుమార్‌ సహకరించడం లేదని, ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనకు సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సుమారు 2 వేల 500 కోట్ల విలువైన శారదా చిట్స్‌ స్కామ్‌లో సాక్ష్యాధారాలను ఉద్దేశ్యపూర్వకంగా మాయాం చేశాడని రాజీవ్‌కుమార్‌పై సీబీఐ ప్రధానంగా ఆరోపిస్తోంది.





Show Full Article
Print Article
Next Story
More Stories