126 మందిలో సగానికి పైగా ఓసీలు

126 మందిలో సగానికి పైగా ఓసీలు
x
Highlights

టీడీపీ మొదటి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. అన్ని సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేస్తూ చంద్రబాబు లిస్టు...

టీడీపీ మొదటి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. అన్ని సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేస్తూ చంద్రబాబు లిస్టు తయారు చేశారు. సగానికి పైగా సీట్లను అగ్రవర్ణాలకు మిగతా సీట్లను బహుజన వర్గాలకు కేటాయించారు.

టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో 126 మంది గాను 72 మంది ఓసీలకు అవకాశం ఇచ్చారు. ఇందులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన. 32 మందికి రెడ్డి సామాజిక వర్గం నుంచి 20 మందికి చోటు దక్కగా మిగతా 19 సీట్లను ఇతర అగ్రవర్నలకు కేటాయించారు. ఇక వెనుకబడిన తరగతులకు చెందిన 31 మందికి తొలి లిస్ట్‌లో ప్రాధాన్యత కల్పించారు. షెడ్యూల్ కులాలకు చెందిన 17 మందికి, షెడ్యూల్ తెగలకు చెందిన నలుగురికి అవకాశం దక్కింది. అలాగే ఇద్దరు మైనార్టీలకు మొదటి జాబితాలో చోటు ఇచ్చారు.

ఎస్సీ సామాజిక వర్గం నుంచి సీటు పొందిన ప్రముఖుల్లో మంత్రి జవహర్, నక్కా ఆనందబాబు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన ఎస్సీ వర్గానికి చెందిన మాజీ మంత్రులు డొక్కా మాణిక్య వర ప్రసాద్, గొల్లపల్లి సూర్యారావు, కొండ్రు మురళీ మోహన్‌కు సీట్లు దక్కాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి అసెంబ్లీ సీటు పొందిన వారిలో మొదటిసారి మంత్రి అయిన కిడారి శ్రవణ్ కుమార్‌తో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి కూడా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories