Top
logo

మురళీమోహన్‌పై కేసు నమోదు

మురళీమోహన్‌పై కేసు నమోదు
X
Highlights

ఓ వైపు ఎన్నికల హడవీడిలో నేతలు ఫుల్ బీజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల వేళ...

ఓ వైపు ఎన్నికల హడవీడిలో నేతలు ఫుల్ బీజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల వేళ అక్కడక్కడ డబ్బు దర్శనం ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా రాజమండ్రి ఎంపీ, టీడీపీ నాయకుడు మురళీమోహన్‌పై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌లో నిన్న రాత్రి ఇద్దరిపై అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా రూ.2 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. దీంతో నిందితులను ప్రశ్నించగా ఈ రూ. రెండు కోట్ల రూపాయలను యలమంచలి మురళీమోహన్‌కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. దీంతో మురళీమోహన్‌తో పాటు మరో ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసినట్టు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. నిమ్మలూరు శ్రీహరి, పండరి, జగన్, ధర్మరాజు, మురళీకృష్ణ, ఎంపీ మురళీ మోహన్‌పై ఐపీసీ సెక్షన్‌ 171(బీ), (సీ), (ఈ), (ఎఫ్‌) లకింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story