ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు

ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు
x
Highlights

ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్లు ఇవ్వడంతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు.. వృద్ధులు, వితంతు పెన్షన్లు వెయ్యి నుంచి 2 వేలకు పెంపు లాంటి పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్లు ఇవ్వడంతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు.. వృద్ధులు, వితంతు పెన్షన్లు వెయ్యి నుంచి 2 వేలకు పెంపు లాంటి పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పలు దశల్లో నిర్మాణంలో ఉన్న లక్షా 26వేల పేదల ఇళ్లకు 756 కోట్లు చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 1996 నుంచి 2004 మధ్య కాలంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు 10వేలు ఇచ్చేందుకు అనుమతినిచ్చింది. ట్రాక్టర్లు, ఆటో రిక్షాలకు లైఫ్ టైమ్ ట్యాక్సు మినహాయింపు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

డ్వాక్రా మహిళలకు సెల్‌ఫోన్లు ఇవ్వాలని ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐటీ ప్రోత్సాహకాలు పొడిగించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చేనేత కార్మికులకు ఆరోగ్యబీమా వర్తింప చేయనున్నారు. రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. క్యాపిటల్ హౌసింగ్ ప్రమోషన్ పాలసీని రూపొందించాలని.. సీఆర్డీఏ చట్టంలో ఈ మేరకు నిబంధనలు పొందుపరచాలని సీఎం సూచించారు. రాజధానిలో జర్నలిస్ట్ సొసైటీకి 25 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. సీఆర్డీఏ చట్టంలో నిబంధనలు పొందుపర్చాక వచ్చే కేబినెట్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్ల అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించారు. ఆ రిజర్వేషన్లలో కాపులకు 5శాతం, మిగిలిన అగ్రవర్ణాలకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అన్నింటిపైనా సమగ్రంగా చర్చించి అసెంబ్లీ ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్లపై రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుందని మంత్రి కాల్వా తెలిపారు.

రైతులను ఆదుకొనేందుకు త్వరలో పెట్టుబడి సాయం అందించనున్నారు. రైతులు, కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం ఖరీఫ్‌ నుంచి ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు వెయ్యి నుంచి 2వేలకు పెంచిన పింఛన్లను, జనవరి నుంచి అమలు చేయనున్నారు. చుక్కల భూములపై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను, ఈ నెలాఖరు నాటికి పరిష్కరించాలని నిర్ణయించారు.

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఇందుకోసం ముందుగా 250 కోట్లు ప్రభుత్వమే చెల్లించానుంది. చిన్నమొత్తాల వారికి ముందుగా చెల్లించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చెల్లింపుల నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేయనున్నారు. మరోవైపు, కేంద్రమంత్రుల ఏపీ పర్యటనపై కేబినెట్‌‌లో కీలక చర్చ జరిగింది. వారి పర్యటనలకు తాము లేఖల ద్వారా జవాబు ఇస్తామని సీఎం, మంత్రులకు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories