ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..
x
Highlights

ఏపీ కేబినేట్‌ భేటీ కొనసాగుతోంది. బీసీ కార్పొరేషన్‌కు ఒక అపెక్స్‌ బాడీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వివిధ కార్పొరేషన్ల పనితీరును అధ్యయనం చేసేలా...

ఏపీ కేబినేట్‌ భేటీ కొనసాగుతోంది. బీసీ కార్పొరేషన్‌కు ఒక అపెక్స్‌ బాడీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వివిధ కార్పొరేషన్ల పనితీరును అధ్యయనం చేసేలా అపెక్స్‌ బాడీ ఏర్పాటుకు నిర్ణయించారు. రవాణా వాహనాల డ్రైవర్ల కోసం 10 కోట్లతో డ్రైవర్‌ సాధికార సంస్థ ఏర్పాటుకు కేబినేట్‌ ఆమోదించింది. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెదబోడేపల్లిలో ఏపీఆర్‌ హైస్కూల్‌ను రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేశారు. యానాదులు, చెంచులకు ఇళ్ల నిర్మాణంలో రాయితీ పెంపునకు కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది.

జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ప్రభుత్వమే తీసుకుని వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి అవసరాన్ని బట్టి జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ కూడా ఇళ్ల నిర్మాణానికి వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రత్యేక కేటగిరీగా తీసుకుని బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చినట్లే జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories