ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ ఎన్నికలపై ప్రీపోల్ సర్వేలు...ఏ పార్టీకి...

ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ ఎన్నికలపై ప్రీపోల్ సర్వేలు...ఏ పార్టీకి...
x
Highlights

ఓవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలోనే మరోవైపు ప్రీపోల్ సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఓటరు నాడి...

ఓవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలోనే మరోవైపు ప్రీపోల్ సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఓటరు నాడి చెప్ప లేకపోయాయి. ఒక సర్వే అధికార పార్టీ టీడీపీకి అనుకూలంగా ఇవ్వగా మరో ఛానల్ ప్రతిపక్ష పార్టీ వైసీపీని సపోర్ట్ చేస్తూ మెజార్టీ స్థానాలు దక్కుతాయని వెల్లడించాయి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రకటించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలు ఏపీలో మాత్రం బీజేపీ ఒక్క సీటు కూడా కైవసం చేసుకోదని స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 స్థానాలకు టీడీపీకి 14, వైసీపీకి 11 సీట్లు వస్తాయని రిపబ్లిక్ సీ-ఓటర్ సర్వే ప్రకటించగా ఇండియా టీవీ పోల్ సర్వేలో మాత్రం టీడీపీ కేవలం మూడు చోట్ల మాత్రమే విజయం సాధిస్తుందని ప్రకటించింది. 22 సీట్లు వైసీపీకి దక్కించుకుంటుందని వెల్లడించింది. ఈ రెండు సర్వేల్లోనూ కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రావని తేల్చి చెప్పాయి.

ఏబీపీ-సీ ఓటర్ సర్వేను పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ, యూపీఏ కూటమికి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. టీడీపీ, వైసీపీ కూడా ఖచ్చితంగా ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించలేదు. 25 స్థానాల్లోనూ ఇతరులు గెలుపొందుతారని మాత్రమే వెల్లడించింది. ప్రీపోల్ సర్వేలు ప్రకటించిన విధంగా ఫలితాలు ఉన్నట్లయితే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉంటుందని భావిస్తున్నారు. సీఎం కుర్చిపై ఆశలు పెట్టుకున్న జగన్ కోరిక నెరవేరుతుందో చంద్రబాబు నాయుడే తిరిగి ముఖ్యమంత్రి అవుతారో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories