టీడీపీలోకి బైరెడ్డి?

టీడీపీలోకి బైరెడ్డి?
x
Highlights

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. వైసీపీ నుంచి...

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలో చేరితే టీడీపీ నుంచి కొంతమంది వైసీపీలో చేరిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కర్నూలుకు చెందిన నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. గతంలో టీడీపీలో ఉన్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర విభజనకు ముందు ఆ పార్టీని వీడారు. అయితే తాజాగా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి బైరెడ్డి పోటీ చేసేందుకు టీడీపీని కోరినట్లు సమాచారం. అనుచరులు సూచన మేరకు భైరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో కలిసి నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కూడా టీడీపీ గూటికి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories