logo

బుద్గాంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు తీవ్రవాదులు హతం..

బుద్గాంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు తీవ్రవాదులు హతం..
Highlights

జమ్మూ కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. చారీ షరీఫ్‌‌లోని జిన్‌పాంచల్ వద్ద ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.

జమ్మూ కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. చారీ షరీఫ్‌‌లోని జిన్‌పాంచల్ వద్ద ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో నక్కిన మరో తీవ్రవాదిని పట్టుకునేందుకు సైనికులు ఎన్‌కౌంటర్ కొనసాగిస్తున్నారు. రహదారులన్నీ దిగ్బంధించి గాలింపు చేపట్టారు. రాష్ట్రీయ రైఫిల్స్, బుద్గాం పోలీస్, సీఆర్‌పీఎఫ్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. కాగా చారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు.

లైవ్ టీవి

Share it
Top