జీవీఎల్‌కు పట్టిన గతే ఆయనకు పడుతుంది...

జీవీఎల్‌కు పట్టిన గతే ఆయనకు పడుతుంది...
x
Highlights

ఇప్పటి ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ట్వీట్టర్ వేదికగా ఇటు సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇక బెట్టింగ్ రాయుళ్లు కూడా వారి బీజీలో వారు...

ఇప్పటి ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ట్వీట్టర్ వేదికగా ఇటు సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇక బెట్టింగ్ రాయుళ్లు కూడా వారి బీజీలో వారు ఉన్నారు. అయితే మరోవైపు ఎన్నికలు ముగిసిన ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోవాడం మాత్రం తగ్గడంలేదు. తాజాగా బుద్ధా వెంకన్న విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మే 23 ఫలితాల అనంతరం వైసీపీ విజయసాయిరెడ్డికి కూడా జీవీఎల్ కు పట్టిన గతి పడుతుందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.

అసలు ప్రజా సమస్యలు పట్టని వారు, ప్రజా క్షేత్రంలో పోటీ చేయలేని జీవీఎల్, విజయ్ సాయి రెడ్డి లాంటి వాళ్లు కూడా మీడియా సమావేశాలు, ట్వీట్లతోనే కాలం ఎల్లదిస్తున్నారని బుద్దా విమర్శించారు. కర్ణాటకలో టీడీపీ అధినేత, ఏపీ ఆపద్దర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంపై వైసీపీ నేతలు చేసిన విమర్శలపై బుద్ధా వెంకన్న స్పందించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని, కాగా ఆర్థిక నేరస్తుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయ్ సాయిరెడ్డి శకుని మామలాంటి వారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. జీవీఎల్ పై చెప్పు విసిరినా సిగ్గురాలేదని బుద్దావెంకన్నతీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories