ఇంకా దొరకని బాలుడు వీరేష్‌ ఆచూకీ

ఇంకా దొరకని బాలుడు వీరేష్‌ ఆచూకీ
x
Highlights

తిరుమలలో నిన్న కిడ్నాపైన బాలుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. వీరేష్‌ కిడ్నాపై దాదాపు 40 గంటలు గడుస్తున్నా ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మరోవైపు కిడ్నాపర్‌‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను జల్లెడపడుతున్నారు. వీరేష్ ఆచూకీ కోసం ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో పోలీసులు గాలిస్తున్నారు. తిరుమలలో డిసెంబర్ 28న బాలుడిని ఎత్తుకెళ్లిన కిడ్నాపర్‌ను పోలీసులు గుర్తించారు.

తిరుమలలో నిన్న కిడ్నాపైన బాలుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. వీరేష్‌ కిడ్నాపై దాదాపు 40 గంటలు గడుస్తున్నా ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మరోవైపు కిడ్నాపర్‌‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను జల్లెడపడుతున్నారు. వీరేష్ ఆచూకీ కోసం ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో పోలీసులు గాలిస్తున్నారు. తిరుమలలో డిసెంబర్ 28న బాలుడిని ఎత్తుకెళ్లిన కిడ్నాపర్‌ను పోలీసులు గుర్తించారు. తిరుపతి రైల్వేస్టేషన్లో టిక్కెట్టు కౌంటర్ దగ్గర బాలుడితో కలిసి ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాంతో, ఆ సమయంలో తిరుపతి మీదుగా వచ్చిపోయే రైళ్ల రాకపోకల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్‌‌ను గుర్తించిన పోలీసులు అగంతకుడి ఫొటోలను విడుదల చేశారు. ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సిఐలతో కూడిన ఆరు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు.

తిరుపతి రైల్వేస్టేషన్‌ సీసీటీవీ కెమెరాల్లో కిడ్నాపర్‌ దృశ్యాలు రికార్డయ్యాయి. డిసెంబర్ 28 ఉదయం 8:30కి టికెట్‌ కౌంటర్‌ దగ్గర ఉన్నట్టు దృశ్యాలు రికార్డు కావడంతో అగంతకుడు‌ ఎవరో దాదాపు గుర్తించారు. కిడ్నాపర్‌‌ను యూపీలోని మధుర ప్రాంతానికి చెందిన బాలాజీగా అనుమానిస్తున్నారు. రెండ్రోజుల క్రితమే అనుమానంతో తిరుమలలో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి వదిలేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర లాతూరుకు చెందిన దంపతులు తమ ఏడాదిన్నర కుమారుడితో కలిసి డిసెంబర్ 28న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే వసతి గృహం దొరక్కపోవడంతో బస్టాండ్‌ సమీపంలోని మాధవ నిలయంలో బస చేశారు. నిద్రలేచి చూచేసరికి తమ కుమారుడు కనిపించకపోవడంతో తల్లడిల్లిపోయారు. చుట్టుపక్కల వెదికినా కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్ ఉదంతంతో టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఏడాది క్రితం జరిగిన రెండు కిడ్నాప్ ఘటనలు మరువకముందే మరోసారి బాలుడి కిడ్నాప్ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories