బాలకృష్ణ నీ యాక్షన్‌ సినిమాల్లో చూపించుకో..: బొత్స

బాలకృష్ణ నీ యాక్షన్‌ సినిమాల్లో చూపించుకో..: బొత్స
x
Highlights

ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ తీరుపై వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా ఎన్నికల...

ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ తీరుపై వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చీపురుపల్లిలో ఓ అభిమానిపై చెయ్యి చేసుకున్న విషయం తెలిసిందే కాగా దీనిపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ఖబడ్దార్‌ బాలకృష్ణా అంటూ హెచ్చరించారు. సోమవారం చీపురుపల్లిలోని జి.అగ్రహారంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో బొత్స మాట్లాడారు. టీడీపీ కార్యకర్త అయినా చీపురుపల్లికి చెందిన ఓ కుర్రాడిని కొట్టే అధికారం అసలు బాలకృష్ణకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బాధిత యువకుడు ఏ పార్టీకి చెందిన వాడో తమకు అవసరంలేదని చీపురుపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తిపై ఈగ వాలినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మీరు సినిమా నటులైతే మీ యాక్షన్‌లు సినిమాల్లో చూపించుకోవాలి తప్ప వీధుల్లోకి వచ్చి మా కుర్రాళ్లను కొడతామంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరన్న సంగతి గుర్తుంచుకోండి బాలకృష్ణను ఉద్దేశించి బొత్స అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories