చంద్రబాబుకు ఝలక్: టీడీపీకి బొడ్డు భాస్కరరామారావు రాజీనామా

చంద్రబాబుకు ఝలక్: టీడీపీకి బొడ్డు భాస్కరరామారావు రాజీనామా
x
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. తూ.గో జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు టీడీపీకి రాజీనామా...

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. తూ.గో జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు టీడీపీకి రాజీనామా చేశారు. పెద్దాపురం అసెంబ్లీ టిక్కెట్టు ఆశించి భంగపడిన ఆయన రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమైనా ఆఖరి నిమిషంలో చుక్కెదురైంది. రాజమండ్రి ఎంపీ సీటును సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు దీపకు కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోయిన భాస్కర్ రామారావు పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యచరణ రెండు రోజుల్లో ప్రకటిస్తానని స్పష్టం చేశారు. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేళ జంపింగ్ జిలానీలు పెరిగిపోయారు. నామినేషన్లు వేసే లోపు ఎవరెవరెక్కడ ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories