Top
logo

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
X
Highlights

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కేంద్ర మంత్రి జేపీ...

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితాలో 250 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. వీటిలో యూపీ నుంచి 30 మంది, బీహార్ నుంచి 17 మంది, మహారాష్ట్ర నుంచి 21 మంది, కేరళ నుంచి 14, ఛత్తీస్‌గఢ్ నుంచి 5 మంది అభ్యర్థుల పేర్లున్నాయి.

ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, అసోం, త్రిపుర, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉన్నాయి. కాగా, ప్రధాని మోదీ వారణాసి నుంచి, రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, స్మృతి ఇరానీ అమేథి నుంచి, గడ్కరి నాగపూర్ నుంచి, వీకే సింగ్ ఘజియాబాద్ నుంచి పోటీ చేయనున్నారు.

Next Story