2019 సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి చెమటలు పుట్టిస్తున్నాయా?

2019 సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి చెమటలు పుట్టిస్తున్నాయా?
x
Highlights

2019 సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి చెమటలు పుట్టిస్తున్నాయా? గత ఎన్నికల్లో కలిసొచ్చిన మోడీ వేవ్ ఈసారి మైనస్ గా మారిందా? అయిదేళ్లలో మోడీ సర్కార్...

2019 సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి చెమటలు పుట్టిస్తున్నాయా? గత ఎన్నికల్లో కలిసొచ్చిన మోడీ వేవ్ ఈసారి మైనస్ గా మారిందా? అయిదేళ్లలో మోడీ సర్కార్ సామాన్యుడిపై వదిలిన అస్త్రాలు ఆ పార్టీ పుట్టి ముంచబోతున్నాయా? 2019 ఎన్నికలంటే బీజేపీ పైకి కనిపించకుండానే టెన్షన్ పడుతోందా? అంటే అవుననే అనుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇంత గందరగోళంలో బీజేపీ ఎప్పుడూ లేదు.. మోడీ నుంచి గల్లీ లీడర్ వరకూ అందరూ ఎన్నికల కోడ్ ను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో జాతీయ రాజకీయ సమీకరణలు బాగా మారిపోయాయి. మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు ఏకం కావడం, ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వస్తుండటంతో బీజేపీ పెద్దల్లో కలవరం మొదలైంది. రాజకీయ విశ్లేషకుల సమాచారం మేరకు కేంద్రంలో ఈసారి హంగ్ గ్యారంటీ అనే అంచనాలు కనిపిస్తున్నాయి. అందుకే బీజేపీ రూటు మార్చిందా? ఏ ఒక్క సీటును వదలకూడదన్న పట్టుదలతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతీ చిన్న పార్టీతోనూ పొత్తుకోసం ప్రయత్నిస్తోంది.

దాదాపు ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 30చిన్నా, చితకా పార్టీలతో జత కట్టింది. మోడీ, అమిత్ షా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. మోడీ కీర్తిని పొగడుతూ ఎన్నో వాణిజ్య ప్రకటనలూ రూపొందాయి. ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ పెద్ద యుద్ధమే చేస్తోంది.అయినా ఎక్కడో భయం వెంటాడుతోంది. మోడీ ఇమేజ్ మసకబారిపోతోందన్న సందేహం వారిని నిలువనివ్వడం లేదు. దాంతో జాతీయ నేతలంతా కోడ్ కు టాటా చెప్పేస్తున్నారు.

నమో పేరుతో టీ కప్పులు, చాయ్ బిస్కట్లు రైల్వే క్యాంటిన్లలో విస్తృతంగా తిరుగుతున్నాయి. రైల్వే కేటరింగ్ ఫుడ్ ప్యాకెట్ పై సైతం నమో స్టాంపే కనిపిస్తోంది. రైల్వే టిక్కెట్ల వెనకా, బస్సు టిక్కెట్ల పైనా, చివరకు ఎయిర్ టిక్కెట్ల వెనకా మోడీ బొమ్మ కనిపిస్తోంది. వీటన్నింటిపైనా ఈసీకి కంప్లయింట్లు వెళ్లినా ఈసీ ఆదేశాలిచ్చినా బీజేపీ పెద్దలు పట్టించుకోటం లేదు మోడీ పేరుతో బయోపిక్ కూడా ప్రచారానికి వాడుకోవాలనే ప్రయత్నాన్ని ఈసీ గట్టిగా అడ్డుకుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ సినిమా విడుదల కారాదని ఆదేశాలివ్వాల్సి వచ్చింది. కానీ అప్పటికే బయోపిక్ ట్రయల్స్ ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని తెహ్రీలో ఎన్నికల కమిషన్ వాహనంపైనే మైభీ చౌకీదార్ క్యాప్ కనిపించింది. కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంతో తమ జెండానూ వాహనానికి పెట్టాలంటూ పట్టుబట్టారు ఈ సంఘటనపై ఈసీ దర్యాప్తుకి ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories