సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మమత బెనర్జీ మార్ఫింగ్ ఫోటోలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మమత బెనర్జీ మార్ఫింగ్ ఫోటోలు
x
Highlights

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీని ప్రియాంక చోప్రా హెయిర్ స్టయిల్‌తో పోల్చుతూ మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మమత ఫోటోను...

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీని ప్రియాంక చోప్రా హెయిర్ స్టయిల్‌తో పోల్చుతూ మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మమత ఫోటోను ప్రియాంక చోప్రా ఫోటోలా మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల 'మెట్ గాలా - 2019' సందర్భంగా ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అలంకరణ చూసి జనాలు షాకైన సంగతి తెలిసిందే. పిచుక గూడును తలపించే హెయిర్ స్టైల్‌లో వింతగా కనిపించిన ప్రియాంకపై సోషల్ మీడియాలో బోలెడన్ని జోకులు, మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ యూత్ వింగ్ బీజేవైఎం హౌరా జిల్లా క్లబ్ కన్వీనర్ ప్రియాంక శర్మ ఆ ఫొటోను మార్ఫింగ్ చేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖాన్ని పెట్టింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియాంక శర్మను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories