logo

తెలంగాణలో ఆ రెండు ఎంపీ సీట్లు బీజేపీవే...:మాజీ సీఎం జోస్యం

తెలంగాణలో ఆ రెండు ఎంపీ సీట్లు బీజేపీవే...:మాజీ సీఎం జోస్యం
Highlights

కేంద్రంలో మరోసారి బీజేపీ జెండా ఎగురుతుందని, తెలంగాణలో కూడా బీజేపీ సత్తా చాటుతుందని సికింద్రాబాద్, మహబూబ్ నగర్...

కేంద్రంలో మరోసారి బీజేపీ జెండా ఎగురుతుందని, తెలంగాణలో కూడా బీజేపీ సత్తా చాటుతుందని సికింద్రాబాద్, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జోస్యం చెప్పారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో పర్యటించిన యడ్యూరప్ప భావిగి భద్రేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో త్వరలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టంచేశారు.

లైవ్ టీవి

Share it
Top