Top
logo

ఏపీలో ఎన్నికల ముందు బీజేపీ ప్లాన్ ఇదీ..!

ఏపీలో ఎన్నికల ముందు బీజేపీ ప్లాన్ ఇదీ..!
X
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు బిజెపి నేతలు. దీనిలో భాగంగా ఫిబ్రవరి...

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు బిజెపి నేతలు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ బస్సు యాత్రను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పలాస నుండి ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 4 నుండి ప్రారంభం కానున్న బీజేపీ బస్సు యాత్ర పై ప్రత్యేక కధనం

మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బిజెపిని బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మి నారాయణ బస్సు యాత్ర చేపట్టనున్నారు . ఈ బస్సు యాత్ర మొత్తం 15 రోజుల పాటు జరగనున్నది. ఈ బస్సు యాత్రను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో 132 నియోజకవర్గాల్లో సాగే లాగా ప్రణాళికలు రూపొందించారు బిజెపి నేతలు.

ఈ యాత్రలో భాగంగా రోడ్ షోలు, బహిరంగ సభలు ఉండేలాగా సన్నాహాలు చేశారు బిజెపి శ్రేణులు. మొత్తానికి ఈ బస్సు యాత్ర ద్వారా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మేలును వివరించే ప్రయత్నం చేసే పనిలో పడ్డారు బిజెపి నేతలు. అంతే కాకుండా ఈ ఫిబ్రవరి నెలలోనే నరేంద్ర మోడీ రెండుసార్లు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మొదటిగా ఫిబ్రవరి 10న గుంటూరులో నరేంద్రమోదీ తో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఫిబ్రవరి 16న కూడా నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ రోజు సైతం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ శ్రేణులు అంటున్నాయి. దీంతోపాటు ఫిబ్రవరి 4 న విజయనగరం, 21 రాజమండ్రి , ఫిబ్రవరి 26న ఒంగోలులో అమిత్ షా పర్యటనలు ఉంటాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ పైన పూర్తి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ బస్సు యాత్ర ఎంత వరకు లాభం అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది.

Next Story