తెలంగాణాలో టీడీపీ, కాంగ్రెస్‌ కనుమరుగే: లక్ష్మణ్‌

తెలంగాణాలో టీడీపీ, కాంగ్రెస్‌ కనుమరుగే: లక్ష్మణ్‌
x
Highlights

తెలంగాణలో పోలింగ్‌ ముగిసింది. చెదురుమదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం చాలా సంతోషంగా...

తెలంగాణలో పోలింగ్‌ ముగిసింది. చెదురుమదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కె. లక్ష్మణ్‌.హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాయలంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్‌ షా, ముఖ్యనాయకులు పాల్గొన్నారని, వారందరికీ తన ధన్యావాదాలన్నారు. అయితే తెలంగాణలో తక్కువ శాతం పోలింగ్ నమోదు అయ్యిందంటే అది కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని తెలుస్తోందన్నారు.

కాగా ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా గల్లంతు కానుందని, కాంగ్రెస్‌ కనుమరుగు కాబోతుందని జోస్యం చెప్పారు. ఇక రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మాత్రమే ఉంటాయని అభిప్రాయపడ్డారు. తాము అనుకున్న వాటి కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. కాగా వచ్చే నెల 23 తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ ఏర్పడబోతోందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 5 గంటల నుంచి మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం, 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగింది. నిజామాబాద్‌లో ఎక్కువ అభ్యర్థులు పోటీ చేస్తుండటం ఎక్కువ ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ను నిర్వహించారు. ఏపీ, తెలంగాణతోపాటు 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ క్లోజైంది. చెదురుమదురు ఘర్షణలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories