చంద్రబాబుకు తలుపులు బంద్ : అమిత్ షా

చంద్రబాబుకు తలుపులు బంద్ : అమిత్ షా
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అవకాశవాది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. ఏ పార్టీ గాలి వీస్తే..ఆ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని...

ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అవకాశవాది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. ఏ పార్టీ గాలి వీస్తే..ఆ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. 2004లో బీజేపీ ఓడిపోగానే చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారని, 2014లో మోదీ హవా చూసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. గుంటూరు జిల్లా నర్సారావుపేటలో జరిగిన ఎన్నికల సభలో అమిత్ షా పాల్గొన్నారు. మళ్లీ ఏన్డీయో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పొత్తుకు యోచిస్తున్నారని, కానీ చంద్రబాబుకు ఏన్డీయోలో తలుపులు మూసుకుపోయాయని అమిత్ షా తెలిపారు. నారా లోకేష్ ప్రగతే చంద్రబాబు ధ్యేయం అని ఆరోపించిన అమిత్ షా ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చిందని వెల్లడించారు. అమరావతి పేరుతో అవినీతి తప్ప ఒక్క నిర్మాణమైనా జరిగిందా? అని ప్రశ్నించారు. నారా చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు. కేవలం బీజేపీ అధికారంలోకి తెస్తే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం.

Show Full Article
Print Article
Next Story
More Stories