బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్...బీజేపీ వైపు పొంగులేటి, జి.వివేక్ చూపు

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్...బీజేపీ వైపు పొంగులేటి, జి.వివేక్ చూపు
x
Highlights

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై బీజేపీ కన్నేసింది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. పలు పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను కాషాయ...

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై బీజేపీ కన్నేసింది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. పలు పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను కాషాయ దళం ఆహ్వానిస్తోంది. ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్‌లో సీటు దక్కని నేతలు, అసంతృప్తితో ఉన్న నేతలతో మంతనాలు సాగిస్తోంది.

ఇటు ప్రచారం అటు నామినేషన్లు ఊపందుకున్న వేళ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసింది. మాజీ మంత్రి డీకె అరుణ, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకున్న కమలదళం మరికొంతమంది నేతలకు గాలం వేస్తోంది. కాంగ్రెస్‌లో టికెట్ దక్కని నేతలు, టీఆర్ఎస్‌లో సీటు దక్కని నేతలతో సంప్రదింపులు సాగిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హైదరాబాద్ నగరంలోనే మకాం వేసి ఇతర పార్టీ నేతలను చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

పార్టీ టికెట్లు ఇస్తామని కొందరికి ఆ అవకాశం లేని వారికి పార్టీలో, మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఓడిపోతే భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని ఏడాది లోపు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు సిద్దమని చెబుతున్నట్లు తెలుస్తోంది.

2014లో ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ జి.వివేక్‌ను కూడా కమలం గూటికి చేర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అటు టీఆర్ఎస్‌ జాబితాలో వీరికి సీటు దక్కకపోవడంతో కూడా బీజేపీకీ కలిసి వస్తోంది. ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి, జి.వివేక్ టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

అటు కాంగ్రెస్ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిపై ఆపరేషన్ ఆకర్ష‌్ ప్రయోగించారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పి బీజేపీలో చేరిన డీ.కె. అరుణకు మహబూబ్‌నగర్ టికెట్ కేటాయించారు. అరుణ రాయబారంతో సునీతా లక్ష్మారెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. డీకె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి బీజేపీ ఎంపీ దత్తాత్రేయ భేటీ అయ్యారు. సునీతా లక్ష్మారెడ్డిని బిజెపిలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories