Top
logo

వ్యానును వెంబడించి.. గోవులను రక్షించిన రాజాసింగ్

వ్యానును వెంబడించి.. గోవులను రక్షించిన రాజాసింగ్
X
Highlights

హైదరాబాద్‌ షామిర్‌పేట్‌లో అక్రమంగా తరలిస్తున్న గోవులను ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టుకున్నారు. గోవులను...

హైదరాబాద్‌ షామిర్‌పేట్‌లో అక్రమంగా తరలిస్తున్న గోవులను ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టుకున్నారు. గోవులను తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఆయన అనుచరులతో కలిసి స్వయంగా చేరుకున్నారు. వాహనం పైకి ఎక్కి ఆవులను చూసిన ఆయన ఎక్కడికి తీసుకెళుతున్నారంటూ ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోవడంతో ఎక్కడి నుంచి తెస్తున్నారో చెప్పాలంటూ వాహనం డ్రైవర్‌, క్లీనర్‌లను ప్రశ్నించారు. అయినా సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులకు అప్పగించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని షామిర్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు .


Next Story