logo

బీజేపీ మేనిఫెస్టో విడుదల...

బీజేపీ మేనిఫెస్టో విడుదల...
Highlights

బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం విడుదల చేసింది. పార్టీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ,...

బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం విడుదల చేసింది. పార్టీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకి సంకల్ప్ పాత్ర అనే పేరు పెట్టారు.

మేనిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలు:

* రాజ్యాంగ విధివిధానాలకు లోబడి అన్ని వర్గాల ఆమోదంతో రామ మందిర నిర్మాణం

* పేద, మధ్య తరగతి రైతులకు పెన్షన్లు ఇస్తాం

* త్వరలో పౌరసత్వం అమలు బిల్లుకు ఆమోదం

* రైతులకు వడ్డీలేని రుణాలు, రైతు పెట్టుబడి సాయం కొనసాగింపు

* రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు

* అందిరికీ విద్యకు ప్రాధాన్యత, 75 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తాం

* కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీతో రుణం

* 60 ఏళ్లు నిండిన సన్న, చిన్నకారు రైతులకు పింఛన్‌ పథకం

* వ్యవసాయ రంగానికి రూ. 25లక్షల కోట్ల కేటాయింపు


లైవ్ టీవి


Share it
Top