logo

సవతి తల్లి ప్రేమపై స్పందించిన బండారు దత్తాత్రేయ

సవతి తల్లి ప్రేమపై స్పందించిన బండారు దత్తాత్రేయ
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం పై చేసిన విమర్శలు సత్యదూరమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం పై చేసిన విమర్శలు సత్యదూరమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.బీజేపీ యేతర ప్రభుత్వాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని అహంకార పూరిత ధోరణిలో కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు దత్తాత్రేయ మండిపడ్డారు.తెలంగాణకు కేంద్రం రెండు లక్షల కోట్లను అనేక గ్రాంట్ల రూపంలో ఇవ్వడం జరిగిందని దత్తాత్రేయ గుర్తుచేశారు.అధికారం వచ్చిందని విర్రవిగడం సరికాదని బండారు అన్నారు. కేంద్రం పట్ల అలాంటి మాటలు అనడం ఎంతవరకు సరైందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని కేటీఆర్‌కు బండారు సూచించారు.

లైవ్ టీవి

Share it
Top