23 మంది విద్యార్ధులు చనిపోయినా ప్రభుత్వానికి..: లక్ష్మణ్

23 మంది విద్యార్ధులు చనిపోయినా ప్రభుత్వానికి..: లక్ష్మణ్
x
Highlights

తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాలతో లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్‌ను నాశనం చేసిందన్నారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌. 23 మంది...

తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాలతో లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్‌ను నాశనం చేసిందన్నారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌. 23 మంది విద్యార్ధులు చనిపోయే విద్యా శాఖ రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేసే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎంసెట్‌ను 3 సార్లు నిర్వహించే దుస్ధితికి చేరుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రేపు బీజేపీ అనుబంధ సంఘాలతో ధర్నా చేపడతామని లక్ష్మణ్‌ తెలిపారు. ఈ నెల 29న పార్టీలతో హైదరాబాద్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేస్తామని, 30న ప్రగతి భవన్‌ ముట్టడి, మే 2న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories