logo

చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం

చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం
Highlights

మోసం, అబద్దాల చెబుతూ చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. చంద్రబాబు మోసపూరిత ఆలోచనతోనే కడప స్టీల్ ప్లాంట్ నూటికి నూరుపాళ్లు ఆలస్యం అవుతుందన్నారు.

మోసం, అబద్దాల చెబుతూ చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. చంద్రబాబు మోసపూరిత ఆలోచనతోనే కడప స్టీల్ ప్లాంట్ నూటికి నూరుపాళ్లు ఆలస్యం అవుతుందన్నారు. రాయలసీమ ప్రజల పట్ల చిత్తశుద్ది ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో మెకాన్ సంస్థకు సకాలంలో సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేదని కన్నా ప్రశ్నించారు. నిరంతరం నారా చంద్రబాబు నాయుడి జీవితం మొత్తం కూడా మోసం, అబద్దాలతోనే కాలం గడుపుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని మోసపూరితమైనటువంటీ దీక్షలు చేపడుతున్నారని కన్నా ఆరోపించారు. దొంగ దీక్షతో 27తేదీన శంకుస్థాపన చేశారని కన్నా మండిపడ్డారు.

లైవ్ టీవి

Share it
Top