మరో మలుపు తిరిగిన జైనూర్‌ జెడ్పీటీసీ ఎన్నిక

మరో మలుపు తిరిగిన జైనూర్‌ జెడ్పీటీసీ ఎన్నిక
x
Highlights

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌ జెడ్పీటీసీ ఎన్నిక మరో ములుపు తిరిగింది. ఎన్నిక ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించిన తరువాత పోటీ నుంచి తప్పుకున్న...

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌ జెడ్పీటీసీ ఎన్నిక మరో ములుపు తిరిగింది. ఎన్నిక ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించిన తరువాత పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ అభ్యర్ధి తెర మీదకు వచ్చారు. తనతో పాటు తన భర్తను కిడ్నాప్ చేసి బెదిరించి బలవంతంగా పోటీ నుంచి తప్పించారంటూ ఆరోపించారు. తుది విడతలో ఏకగ్రీవమైన ఏకైక ZPTC స్ధానం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైసూర్ స్థానం. మాజీ ఎమ్మెల్యే అయిన కోవా లక్ష్మి టీఆర్ఎస్ తరపున ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు.

అయితే ఇప్పుడు ఈ ఏకగ్రీవమే తీవ్ర స్థాయిలో విమర్శలతో పాటు రోజుకో వివాదాన్ని రాజేస్తోంది. తమ సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరించారంటూ ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై విచారణ జరుగుతుండగానే తమను కూడా కిడ్నాప్ చేసి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించేలా ఒత్తిడి తెచ్చారని బీజేపీ అభ్యర్ధి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

కోవా లక్ష్మి ఎన్నికను రద్దు చేసి పోలింగ్ నిర్వహించాలని అటు కాంగ్రెస్‌ ఇటు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి తక్షణమే నిర్ణయం తీసుకోవాలంటూ కోరుతున్నారు . వరుస కిడ్నాప్‌, ఫోర్జరీ కేసులు రావడంతో ఎన్నికను ఆమోదించే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జరిగిన పరిణామనాలను తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి నివేదిక పంపుతామని వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తాము నడుచుకుంటామని అధికారులు చెబుతున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories