Top
logo

నిజామాబాద్ ఎంపీగా కవిత విఫలం : అర్వింద్

నిజామాబాద్ ఎంపీగా కవిత విఫలం : అర్వింద్
Highlights

నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత విఫలమయ్యారని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విమర్శించారు. జగిత్యాల...

నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత విఫలమయ్యారని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు, బూత్ లెవల్ కమిటీ సభ్యుల సమావేశానికి హాజరైన ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు కవిత చేసింది శూన్యమని అన్నారు. పసుపు బోర్డ్ అంశంలో కవిత కేంద్రానికి సరైన సమాచారం ఇవ్వలేదని తప్పు పట్టారు. పసుపు బోర్డ్ ఏర్పాటు గురించి బీజేపీ మేనిఫెస్టోలో చేర్చామన్న అర్వింద్, పసుపు, ఎర్రజొన్న రైతుల పెట్టుబడిలో 50 శాతం లాభం వచ్చేలా పాలసీని తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.

Next Story