తెలంగాణలో విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ విధానం

తెలంగాణలో విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ విధానం
x
Highlights

కార్పొరేట్ విద్యారంగాన్ని తలపించే విధంగా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆచరణలో అమలు కావడం లేదు. రాష్ర్టంలో ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకు వచ్చిన...

కార్పొరేట్ విద్యారంగాన్ని తలపించే విధంగా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆచరణలో అమలు కావడం లేదు. రాష్ర్టంలో ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకు వచ్చిన బయోమెట్రిక్ హాజరు విధానం కుంటుపడింది ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకుని రెండేల్లు గడిచినా ఆచరణలో కనిపించడం లేదు.

తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చాలన్న సంకల్పంతో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా హాజరు శాతం పెంపొందించాలని బయోమెట్రిక్ విధానాన్ని కల్పించింది. ఇందు కోసం అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారు ఉన్నతాధికారులు. కేవలం డిగ్పరీ కాలేజీల్లోనే కాకుండా ఇంజినీరింగ్ విద్యా విధానంలోనూ బయోమెట్రిక్ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ కళాశాలలోనూ ఈ విధానం అమలు కాలేదు.

ప్రభుత్వం నుంచి సరైన నిధులు రాకపోవడమే బయోమెట్రి విధానం అమలుకు ఆలస్యమైందని చెబుతున్నారు ప్రైవేట్ కళాశాల నిర్వాహకులు. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో సమస్యలు పరిష్కారం అవుతాయని భావించనప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటున్నారు.

మరో వైపు విద్యార్ధుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని బయో మెట్రిక్ విధానం అమలు చేస్తున్నామంటున్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. ఈఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుందంటున్నారు. బయోమెట్రిక్ విధానంతో విద్యావ్యవస్థ మెరుగుపడుతుందన్నారు పాపిరెడ్డి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనప్పటికి ఇంకా అమలు కాకపోవడానికి కొన్ని సమస్యలున్నప్పటికీ వచ్చే ఏడాదిలోనైనా బయోమెట్రిక్ విధానం అమలులోకి వస్తుందో లేదే చూడాలి మరీ.


Show Full Article
Print Article
Next Story
More Stories