వైసీపీకి ఊహించని షాక్

jagan
x
jagan
Highlights

ప్రజా సంకల్ప యాత్రతో మంచి ఊపుమీద ఉన్న ప్రతిపక్ష వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న సీనియర్ నేత సినీ హీరో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రజా సంకల్ప యాత్రతో మంచి ఊపుమీద ఉన్న ప్రతిపక్ష వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న సీనియర్ నేత సినీ హీరో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతర్గత కారణాల వల్ల పార్టీలో ఇమడలేక పోతున్నానంటూ ప్రకటించిన ఆయన దీని వల్లే గత కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు తెలిపారు. రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించిన ఆయన ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతానన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర రేపటితో ముగస్తున్న సమయంలో కీలకనేత ఆదిశేషగిరిరావు రాజీనామా ప్రకటన చేయడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories