ఇసుక అక్రమ తవ్వకం అంశంలో ఏపీ ప్రభుత్వానికి షాక్

ఇసుక అక్రమ తవ్వకం అంశంలో ఏపీ ప్రభుత్వానికి షాక్
x
Highlights

ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇసుక అక్రమ దందా వ్యవహారంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏపీ సర్కారుకు 100 కోట్ల జరిమానా...

ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇసుక అక్రమ దందా వ్యవహారంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏపీ సర్కారుకు 100 కోట్ల జరిమానా విధించింది. 100 కోట్ల రూపాయలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే ఆపాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు అక్రమ తవ్వకాలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధిత శాఖాధిపతులు అందరూ బాధ్యులేనని జాతీయ హరిత ట్రైబ్యునల్ వ్యాఖ్యానించింది.

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయని అనుమోలు గాంధీ గతంలో ఎన్జీటీకి లేఖ రాశారు. ఆ లేఖను పిటిషన్ గా స్వీకరించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వెంటనే తనిఖీలు చేయాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణ నిజమేనని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ళు తేల్చాయి. రోజుకు 2500 ట్రక్కుల్లో అక్రమ ఇసుకను తరలిస్తున్నట్లు తనిఖీలో వెల్లడైందని నివేదిక సమర్పించాయి. నివేదికను పరిశీలించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పర్యావరణానికి నష్టం కలిగించేలా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు అభిప్రాయపడింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ వేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ శాఖలను ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories