గూలాబీ గూటికి మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..?

గూలాబీ గూటికి మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..?
x
Highlights

ఇటివలే లోక్‌సభ ఎన్నికలు ముసిగిన విషయం తెలిసిందే. ఇక ఫలితాలకోసం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు గూలాబీ పార్టీ కొలుకొలేని షాక్...

ఇటివలే లోక్‌సభ ఎన్నికలు ముసిగిన విషయం తెలిసిందే. ఇక ఫలితాలకోసం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు గూలాబీ పార్టీ కొలుకొలేని షాక్ ఇచ్చేందుకు రేడి అవుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుండి పదిమందికి పైగా కారేక్కేందుకు రేడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెలేలు త్వరలోనే గూలాబీ గూటికి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 24వ తేదిన ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకొనున్నారని సమాచారం. ఆ ముగ్గురు ఏవరని అనుకుంటున్నారా? ఆ ముగ్గురిలో ఒకరు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ జాబితాలో ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా రైతు పండించిన పంటలో ప్రతి గింజకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పిస్తాన్న నిర్ణయాన్ని ఒక సంవత్సరం లో అమలు చేస్తే సంగారెడ్డి లో చంద్రశేఖర్ రావుకు గుడి కట్టిస్తానని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేసారు. జగ్గారెడ్డి నిర్ణాయానికి సానుకులంగానే ఉన్నట్లే సమాచారం. జగ్గారెడ్డి, వీరయ్య, వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం మిగలనున్నారు. ఇక వీరు టీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ పార్టీలో మిగిలేది ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు మాత్రమే అని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ మీద దెబ్బ కొడుతూ వస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యూహరచన చేసినట్టు కనిపిస్తోంది.





Show Full Article
Print Article
Next Story
More Stories