ఫిబ్రవరి 26లోగా దేశం విడిచి వెళ్లండి..!

ఫిబ్రవరి 26లోగా దేశం విడిచి వెళ్లండి..!
x
Highlights

అమెరికాలో ఫార్మింగ్‌టన్ యూనివర్శిటీ కేసులో అరెస్ట్ అయిన 16 మంది విద్యార్థులకు కోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26లోగా స్వచ్ఛందంగా స్వదేశాలకు...

అమెరికాలో ఫార్మింగ్‌టన్ యూనివర్శిటీ కేసులో అరెస్ట్ అయిన 16 మంది విద్యార్థులకు కోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26లోగా స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లిపోయేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. 20 మంది విద్యార్థుల్లో ముగ్గురు ముందుగానే వాలంటరీ డిపార్చర్ అనుమతి పొందారు. వారిలో ఇద్దరు ఇండియన్స్ కాగా, ఒకరు పాలస్తీనాకు చెందిన వారు. ఫార్మింగ్‌ టన్ ఫేక్ యూనివర్శిటీ కేసులో అరెస్ట్ అయిన విద్యార్థుల ఫైనల్ హియరింగ్ ఈ నెల 12న జరిగింది. అరెస్టు అయిన 20 మందిలో 12 మంది కేలహోస్ కౌంటీ జైల్లో, మిగిలిన 8మంది మన్రో కౌంటీ జైలులోనూ ఉన్నారు. అయితే, ముగ్గురికి స్వదేశాలకు వెళ్లేందుకు ముందే అనుమతి లభించింది. మిగిలిన 17 మందిపై నిన్న విచారణ జరిగింది.

17 మందిలో 15 మందికి కూడా స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లే అవకాశాన్ని కోర్టు కల్పించింది. వీరిలో 8మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఇంకో ఇద్దరిలో ఒకరు యూఎస్ గవర్నమెంట్ రిమూవల్ కింద వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇవ్వగా, మరో విద్యార్థి యూఎస్ సిటిజన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అందుకు అతను బెయిల్ బాండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మొత్తం 16 మంది విద్యార్థులు కోర్టు జడ్జిమెంట్ మేరకు వాలంటరీగా ఈ నెల 26లోగా యూఎస్ వదిలి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆ విద్యార్థులు రిటర్న్ జర్నీకి సిద్ధమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories