logo

ఎన్నికల్లో గెలుపు పై భయం లేదు

ఈసారి తనను ఎన్నికల్లో ఓడించడానికి నంద్యాల, ఆళ్లగడ్డ ప్రత్యర్థులు ఏకం అవుతున్నారని ఏపీ మంత్రి భూమ అఖిల ప్రియ అన్నారు.

Bhuma Akhila PriyaBhuma Akhila Priya

ఈసారి తనను ఎన్నికల్లో ఓడించడానికి నంద్యాల, ఆళ్లగడ్డ ప్రత్యర్థులు ఏకం అవుతున్నారని ఏపీ మంత్రి భూమ అఖిల ప్రియ అన్నారు. ఇవాళ కర్నూలులో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు పై భయం లేదని భారీ మెజారిటీతో గెలిచి తన విజయాన్ని చంద్రబాబునాయుడుకు కానుకగా ఇస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో కొడుకును నిలబెట్టాలో భార్యను నిలబెట్టాలో గంగుల ప్రభాకర్ రెడ్డికి అర్థం కావడం లేదని అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే భూమా కుటుంబానికి తెలుసని అఖిల ప్రియ అన్నారు.


లైవ్ టీవి

Share it
Top