జనసేన ఎఫెక్ట్.. ఎంపీగా గెలవబోతున్న వైసీపీ అభ్యర్థి!

జనసేన ఎఫెక్ట్.. ఎంపీగా గెలవబోతున్న వైసీపీ అభ్యర్థి!
x
Highlights

ఏపీలో ఎన్నికల సమరం ముగిసి నెల దాటిన కానీ హడావిడి మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు. ఓ వైపు ఏపీలో భానుడు భగ్గుమంటున్నాడు. అంతకంతకు సెగలు పుట్టిస్తున్నాడు....

ఏపీలో ఎన్నికల సమరం ముగిసి నెల దాటిన కానీ హడావిడి మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు. ఓ వైపు ఏపీలో భానుడు భగ్గుమంటున్నాడు. అంతకంతకు సెగలు పుట్టిస్తున్నాడు. మరోవైపు ఏపీ రాజకీయ వేడితో ఏపీ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరి కొద్దిరోజులున్నా నేపథ్యం బెట్టింగ్ రాయుళ్లు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. మరోవైపు ఆపార్టీ నేతలు ఈసారి విజయకేతనం ఎగరవేసేది మేమేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీలో ఓ యువనేత ఇప్పడు వెరీ హట్ టాపిగ్ మారారు. అసలు ఇంతకీ ఎవరనుకుంటున్నారా? రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్. ఓయ్ నిన్నే అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. బీసీ సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌గా సేవలందించిన మార్గాని నాగేశ్వరరావు కుమారుడే భరత్ రామ్. తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీలో కీలక పాత్ర పోషించించారు. అయితే ఏపీ సార్వత్రి ఎన్నికల ముందు వైసీపీ గూటికి చేరారు. దినికి గల కారణం టీడీపీ నుండి రాజమహేంద్రవరం టికెట్ దక్కకపోవడంతో ఈ యువ నేత వైసీపీ తీర్ధంపుచ్చుకున్నారు.

ఇటివల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మార్గాని భరత్ వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగగా టీడీపీ నుండి మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపాదేవి, ఇటు జనసేన పార్టీ తరపున ఆకుల సత్యనారాయణ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ నాయకులు పోల్ మేనేజ్ మెంట్ బాగా చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు పక్క వ్యూహాలతో పార్టీ నుంచి వచ్చిన సొమ్ముతో పాటు తాము సొంతంగా సమకూర్చుకున్న ఆర్థిక వనరులతో పక్కా ప్లాన్‌గా చేసుకున్నారట. అయితే దీనికి తోడు అక్కడ క్రాస్ ఓటింగ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు మాత్రం ఇటు టీడీపీ జనసేన, వైసీపీలకు వేసి ఒక్క ఎంపీ ఓటు మాత్రం మార్గాని భరత్ కే వేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ప్రచారంతో వైసీపీకి బలం చేకూరినట్లైంది. ఇటీవల రూపా దేవి కూడా ఇదే విషయాన్ని మీడియాతో వెల్లడించారు. మొత్తానికి జనసేన పోటీలో ఉండడం వల్ల తెలుగుదేశం ఓటు చీలిపోయి మార్గాని భరత్‌కు ప్లస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. జనసేనతో కలిసోచ్చిన భరత్ విజకేతనం ఎగురవేస్తారా లేదా అనేది మే 23 వరకు వేచి చూడాల్సిందే.






Show Full Article
Print Article
Next Story
More Stories