భార్య ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో కామెంట్...యువకుడిని చితకబాదిన కలెక్టర్

Bengal IAS Officer
x
Bengal IAS Officer
Highlights

ఓ కలెక్టర్ హద్దు మీరాడు. తన భార్య ఫేస్‌బుక్ ప్రొఫైల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఓ యువకుడిని చితకబాదాడు. క్షమించాలని ఆ యువకుడు కాళ్లపై పడి వేడుకున్నా కలెక్టర్ కనికరించలేదు.

ఓ కలెక్టర్ హద్దు మీరాడు. తన భార్య ఫేస్‌బుక్ ప్రొఫైల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఓ యువకుడిని చితకబాదాడు. క్షమించాలని ఆ యువకుడు కాళ్లపై పడి వేడుకున్నా కలెక్టర్ కనికరించలేదు. కోపంతో రగిలిపోయిన కలెక్టర్‌ పోలీస్‌స్టేషన్‌లోనే అందరూ చూస్తుండగానే ఆ యువకుడిని ఇష్టమొచ్చినట్లు కొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.

అలీపూర్‌దౌర్ జిల్లా మెజిస్ట్రేట్‌గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ నిఖిల్ నిర్మల్, అతని భార్య ఇద్దరూ కలిసి ఆ వ్యక్తిపై చేయి చేసుకోవడం వైరల్‌గా మారింది. యువకుడు కలెక్టర్ భార్య ఫేస్‌బుక్ ప్రొఫైల్‌పై ఏవో కామెంట్స్ చేశాడని తెలిసి.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడికి వెళ్లిన కలెక్టర్, అతని భార్య చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చితకబాదారు. ఫలకటా పోలీస్ స్టేషన్‌లో సీఐ సౌమ్యజిత్ రే ఎదురుగానే కలెక్టర్ ఆ యువకుడిని కొట్టడం చర్చనీయాంశంగా మారింది.



Show Full Article
Print Article
Next Story
More Stories