యాదాద్రి పుణ్యక్షేత్రంలో బెల్లం లడ్డూ ప్రసాదం

యాదాద్రి పుణ్యక్షేత్రంలో బెల్లం లడ్డూ ప్రసాదం
x
Highlights

యాదాద్రి...భక్తులు అత్యంత పవిత్రంగా కొలిచే పుణ్యక్షేత్రాల్లో ఒకటి.. ఇక్కడికి వచ్చే భక్తులకు అందించే లడ్డూ ప్రసాద విషయంలోనూ ప్రత్యేకత చాటేందుకు...

యాదాద్రి...భక్తులు అత్యంత పవిత్రంగా కొలిచే పుణ్యక్షేత్రాల్లో ఒకటి.. ఇక్కడికి వచ్చే భక్తులకు అందించే లడ్డూ ప్రసాద విషయంలోనూ ప్రత్యేకత చాటేందుకు సిద్ధమయ్యింది దేవాదాయ శాఖ. ఇప్పటి వరకు చక్కెర ఇతర మిశ్రమాలతో తయారు చేసిన లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండేది.. ఇక నుంచి చెక్కర లడ్డూతోపాటు బెల్లం పానకం లడ్డూ కూడా భక్తులకు అందించేందుకు సిద్ధమయ్యింది.

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇక నుంచి బెల్లం లడ్డూలు ప్రసాదంగా లభించనున్నాయి. ప్రస్తుతం భక్తులకు అందిస్తున్న చెక్కర లడ్డూ ప్రసాదంతో పాటు బెల్లం లడ్డూను అదనంగా విక్రయించేందుకు ఆలయ యంత్రాంగం కసరత్తు చేపట్టింది. చెక్కర పానకంతో లడ్డూలు తయారు చేసిన తరహాలోనే బెల్లం లడ్డూ తయారీ చేయనున్నారు. ఇప్పటికే శాంపిల్ గా తయారు చేసిన బెల్లం లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచారు.

భక్తులకు బెల్లం లడ్డూ ప్రసాదం అందించేందుకు ఆలయ ఈవో ఐదుగురు ఏఈఓలో, ఇద్దరు ప్రధాన పూజారులు., ఇద్దరు వంట స్వాములు, ఇద్దరు పర్యవేక్షకులు కలిపి మొత్తం 11 మంది ఉద్యోగులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. లడ్డూల రుచి నాణ్యత ఎల ఉందో అదిగి తెలుసుకున్నారు. లడ్డూ తయారీకి సంబంధించిన ప్రక్రియ, రుచి, నాణ్యత పరిణామాల అంశాలను రాష్ర్ట దేవాదాయ శాఖ కమిషనర్ కు నివేధించారు. గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే భక్తులకు ప్రసాద లడ్డూతో పాటు బెల్లం లడ్డూలను అదనపు కౌంటర్ల ద్వారా విక్రయిస్తామని ఆలయ ఈవో గీతా రెడ్డి చెప్పారు.

చెక్కర కంటే బెల్లంతో తయారూ చేసిన లడ్డూలు భక్తితో పాటు ఆరోగ్యాన్ని పెంచుతాయంటున్నారు భక్తులు. లడ్డూ ప్రసాద విషయంలో దేవస్థానం నిర్ణయం మంచిదంటున్నారు.

స్వామి వారి ప్రసాదం మరింత రుచిగా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంచే విషయంలో బెల్లం లడ్డూలు బాగుంటాయనే ఉద్దేశ్యంతో ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టినట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి యాదాద్రి లక్ష్మీ నరసింహుడి భక్తులకు త్వరలోనే కొత్తరకం లడ్డూల రుచి చూసే భాగ్యం దక్కనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories