Top
logo

బేగంపేటలో బీరు సీసాల లారీ బోల్తా

బేగంపేటలో బీరు సీసాల లారీ బోల్తా
Highlights

హైదరాబాద్‌లోని బేగంపేటలో సోమవారం తెల్లవారుజామున బీరు కాటన్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. సంగారెడ్డి...

హైదరాబాద్‌లోని బేగంపేటలో సోమవారం తెల్లవారుజామున బీరు కాటన్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. సంగారెడ్డి నుండి ఉప్పల్ వెళ్తున్న లారీ బేగంపేట ఫైఓవర్ డీవైడర్‌ను ఢీ కొట్టింది దీంతో రోడ్డుపై బీర్లు పడిపోవడంతో వెహికిల్స్ ఆపి మరీ ఘటనను చూస్తున్న వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో వాటిని దొంగలించేందుకు స్థానికులు ఎగబడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బీరుసిసాలకు కాపలా కాస్తున్నారు. అదే విధంగా ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. అయితే డ్రైవర్ నిర్ల‍క్ష్యం, అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.


Next Story


లైవ్ టీవి